రాజకీయ పాత్రలో సునీల్.. జననాయకన్‌లో కీలక పాత్ర!

Sunil Political Entry in Kollywood

నటుడిగా సునీల్ మళ్లీ ఫుల్ బిజీగా మారాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, గత ఏడాది 11 సినిమాలు, ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు. ‘రామం రాఘవం’ మరియు ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలలో తన ప్రతిభను మరోసారి నిరూపించాడు.

ఇప్పుడు తాజాగా సునీల్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘జననాయకన్’లో ఓ కీలక రాజకీయ నాయకుడి పాత్రకు సునీల్ ఎంపికయ్యాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

విజయ్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న ‘జననాయకన్’లో, సునీల్ ఒక ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించనున్నాడట. ఇందులో సునీల్ వైట్ అండ్ వైట్ గెటప్‌లో చాలా ఆసక్తికరంగా కనిపించనున్నాడని సమాచారం.

‘జైలర్’ సినిమాతో తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్, ఇప్పుడు ‘జననాయకన్’లో మరింత స్థానం సంపాదించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే ఒరవడిలో సునీల్ తమిళ పరిశ్రమలో మరింత మెరిసే అవకాశం ఉందని అంటున్నారు.

Read More

One thought on “రాజకీయ పాత్రలో సునీల్.. జననాయకన్‌లో కీలక పాత్ర!

Comments are closed.