శ్రేయాస్ అయ్యర్‌కు తిరిగి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు..!

central contract bcci

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కు బీసీసీఐ నుంచి భారీ ఊరట లభించే అవకాశముంది. గత ఏడాది అతడిని బోర్డు కేంద్ర అనుబంధ జాబితా (సెంట్రల్ కాంట్రాక్ట్) నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, తిరిగి శ్రేయాస్ అయ్యర్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేర్చే అంశంపై బోర్డు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన కార్యనిర్వాహక సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం.

గతంలో బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల 2024 సంవత్సరానికి అతడిని జాబితా నుంచి తొలగించారు. అయితే ఇప్పుడు శ్రేయాస్ ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటూ అతడికి మళ్లీ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Read More

One thought on “శ్రేయాస్ అయ్యర్‌కు తిరిగి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు..!

Comments are closed.