తెలుగు సినీ ప్రపంచంలో శోభన్ బాబు అనే పేరు కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నటించిన ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇంకా ప్రేక్షకుల మనసుల్లో నిలిచేలా ఉన్నాయి. తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించిన శోభన్ బాబు తన కుటుంబాన్ని మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంచారు. కానీ ఇప్పుడు ఆయన వారసుడు మరొక రంగంలో తన ప్రతిభను చాటుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
శోభన్ బాబు మనవడిగా పరిచయమైన సురక్షిత్ గైనకాలజిస్ట్‌గా చెన్నైలో సేవలందిస్తున్నాడు. తాజాగా ఓ అరుదైన సర్జరీ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో ఏర్పడిన 4.5 కేజీల సిస్ట్‌ను అత్యాధునిక ట్రూ త్రీడీ ల్యాప్రోస్కోపిక్ సాంకేతికతతో తొలగించి హిస్టరీ క్రియేట్ చేశాడు.
ఈ జఘన్య సిస్ట్‌ను సురక్షిత్ సుమారు 8 గంటల పాటు సర్జరీ చేసి విజయవంతంగా తొలగించాడు. సాధారణంగా ఇంత భారీ సిస్ట్‌ను తొలగించాలంటే ఓపెన్ సర్జరీ అవసరం అయితే, ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో ఈ పని చేయడం ఓ సంచలనంగా మారింది. ఈ విజయంతో అతను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
ఇండిగో ఉమెన్స్ సెంటర్ పేరిట చెన్నైలో హాస్పిటల్ నడుపుతున్న సురక్షిత్ ఇప్పటివరకు 10 వేలకుపైగా సర్జరీలు చేసి అనేక మందికి ప్రాణదాతగా నిలిచాడు. తన తాత శోభన్ బాబు లాగే గొప్ప పేరు తెచ్చుకుంటూ, మరొక రంగంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నాడు.
One thought on “గిన్నీస్ రికార్డ్ సాధించిన తెలుగు డాక్టర్.. శోభన్‌బాబు మనవడే!”
Comments are closed.