మెట్ గాలా 2025లో భారతీయ సెలబ్రిటీలు తన విశిష్టతను చాటగా, ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ షో స్టాపర్‌గా నిలిచింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ తదితరులు హాజరయ్యారు. కానీ అందరిలోనూ ఇషా అంబానీ గ్లామర్ అందాలను మెరిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఇషా ధరించిన వజ్రాల హారం “ఓషన్స్ 8” సినిమాలో అన్నా హథవే ధరించిన కార్టియర్ హారానికి పోలికగా ఉండటంతో ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే నిజానికి రెండు హారాల డిజైన్ వేరు కాగా, రెండింటికీ ప్రేరణ నవానగర్ మహారాజా కోసం 1931లో రూపొందించిన అసలు కార్టియర్ హారమే అని వెల్లడైంది.

అన్నా హథవే నెక్లెస్‌ను ఆర్కైవ్ ఫొటోలను ఆధారంగా తిరిగి డిజైన్ చేయగా, దాని విలువ 150 మిలియన్ డాలర్లు అని చెబుతున్నారు. ఈ విలువను బట్టి అసలు వజ్రాల హారం ఖరీదు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాలక్రమేణా అసలు హారం చిన్న ముక్కలుగా విడిపోగా, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపకుల చేతికి వెళ్లింది.

ఇషా ధరించిన హారం వాస్తవానికి తన తల్లి నీతా అంబానీకి చెందినదని ఆమె పేర్కొనడం విశేషం. ఇది కార్టియర్ డిజైన్‌కు ప్రేరణగా తయారు చేసిన కస్టమ్ పీస్ కాగా, ఆమె ధరించిన దుస్తులు అనామిక ఖన్నా డిజైన్ చేయగా, లుక్‌ని అనైతా ష్రాఫ్ అడజానియా స్టైలింగ్ చేసింది. ఈ ఏడాది మెట్ గాలాలో ఇషా ఐదోసారి హాజరైంది.


One thought on “మెట్ గాలా 2025లో ఇషా అంబానీ హంగామా!”
Comments are closed.