డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు, ఈసారి ‘#సింగిల్’ అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ప్రేమకు దూరంగా ఉండమంటూ చెప్పే వ్యక్తి చివరికి ప్రేమలో పడతాడా? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో మంచి అంచనాలు ఏర్పరిచింది.
ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘శిల్పి ఎవరో’ అనే లిరికల్ మెలోడీ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన ఈ మెలోడీ, హృదయాన్ని హత్తుకునేలా ఉంది. యాజిన్ నజీర్ గానం, శ్రీమణి సాహిత్య సమర్పణ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వయోలిన్ సంగీతంతో మ్యూజిక్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. పాటలో శ్రీవిష్ణు తన నటన, ఎక్స్‌ప్రెషన్లతో ఆకట్టుకోగా, కథానాయికలైన కేతికా శర్మ, ఇవానా వారి గ్లామర్, స్టెప్స్, లోకేషన్లతో పాటకు మరింత అందాన్ని తెచ్చారు.
‘శిల్పి ఎవరో’ పాటకు వస్తున్న రెస్పాన్స్‌ను చూస్తే, సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయని స్పష్టంగా తెలుస్తోంది. మెలోడీ ప్రేమికుల హృదయాలను కదిలించిన ఈ పాట, సినిమా ఎమోషన్‌ను ఎలివేట్ చేయబోతుందనే నమ్మకం మేకర్స్‌లో ఉంది. మే 9న విడుదల కానున్న ‘#సింగిల్’ సినిమాతో శ్రీవిష్ణు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని సినీ అభిమానులు భావిస్తున్నారు.

One thought on “శ్రీవిష్ణు ‘#సింగిల్’ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ – ‘శిల్పి ఎవరో’”
Comments are closed.