మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, భక్తి విషయంలో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటాడు. తాజాగా, దర్శకుడు బుచ్చిబాబు సానాకు ఓ పవిత్రమైన కానుక పంపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ కానుకలో శ్రీరాముడి పాదుకలు, హనుమాన్ చలీసా పుస్తకం, హనుమంతుని విగ్రహంతో కూడిన ప్రత్యేక బాక్స్ ఉంది.
ఈ బాక్స్‌పై “బుచ్చి” అని ముద్రించడంతో పాటు, చరణ్ స్వయంగా రాసిన లేఖ కూడా ఉంది. “హనుమంతునిపై నా నమ్మకం ఎన్నో కష్ట సమయాల్లో నాకు ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా ఈ ఆధ్యాత్మిక శక్తిని అనుభవించాలి” అంటూ బుచ్చిబాబుకు రాసిన ఈ సందేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంది.

ఈ కానుకను స్వీకరించిన బుచ్చిబాబు తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “రామ్ చరణ్, ఉపాసన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హనుమంతుడి ఆశీర్వాదాలు మీతో ఉండాలి” అంటూ భావోద్వేగంతో స్పందించారు. చరణ్ ఇచ్చిన ఈ కానుక తన జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. చరణ్ భక్తి మార్గంలో నడిచే వ్యక్తి అని అందరికీ మరోసారి రుజువైంది.

ఇదే సందర్భంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌ను శ్రీరామ నవమి రోజున విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ వీడియో కోసం ఏఆర్ రెహ్మాన్ ప్రత్యేకంగా నేపథ్య సంగీతాన్ని సిద్ధం చేసినట్టు టాక్. అభిమానులు ఈ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే, చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతుండటంతో, ఈ లోపు ‘పెద్ది’ షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.


One thought on “ఆధ్యాత్మిక కానుకతో బుచ్చిబాబును ఆశ్చర్యపరిచిన రామ్ చరణ్”
Comments are closed.