పాకిస్తాన్‌పై భారత దాడుల ప్రభావం వెలుగులోకి !

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత బలగాలు తీవ్ర ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలను భారత క్షిపణులు ధ్వంసం చేశాయి.

ఇప్పటివరకు భారత్ దాడుల వల్ల తమకు నష్టం లేదని బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ చివరకు అసలైన నిజాన్ని ఒప్పుకుంది. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలతో ఇది స్పష్టమైంది.

శుక్రవారం రాత్రి జరిగిన ఓ సభలో షరీఫ్ మాట్లాడుతూ, “మే 9 మరియు 10 మధ్య అర్ధరాత్రి సమయంలో భారత్ తన దాడులు ప్రారంభించింది. తెల్లవారుజామున 2:30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ నన్ను ఫోన్ చేసి, భారత్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని, రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌ సహా కొన్ని ప్రాంతాలు లక్ష్యంగా మారాయని చెప్పారు” అని వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఎంతదూరానికి వెళ్ళిందో అప్పుడు అర్థమైందని షరీఫ్ వ్యాఖ్యానించారు. అయితే, పాక్ ఎయిర్‌ఫోర్స్ చైనీస్ యుద్ధవిమానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌కు ధీటుగా బదులిచ్చిందని ఆయన తెలిపారు.

Read More : సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు ముమ్మరం

One thought on “పాకిస్తాన్‌పై భారత దాడుల ప్రభావం వెలుగులోకి !

Comments are closed.