సినీ ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టడం ఒక ఎత్తు అయితే, అక్కడ నిలదొక్కుకోవడం మరో ఎత్తు. గ్లామర్ ప్రపంచం చూడ్డానికి రంగుల రాజ్యం లా కనిపించినా, దాని వెనుక ఎన్నో కష్టాలు, ఇబ్బందులు దాగున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక్క సినిమాతోనే ఎవరికైనా జీవితమే మారిపోతుంది. ఇప్పుడు కయ్యదు లోహర్‌కు అదే అనుభవం వచ్చింది.
2021లో ‘ముకిల్ పేట్’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కయ్యదు, ఆ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత మలయాళంలో ‘పత్తొండదామ్ నూట్రాండు’ సినిమాలో నటించింది. కానీ అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. తెలుగులో ‘అల్లూరి’, మరాఠీలో ఒక సినిమా చేసినా, ఆమెకు కావలసిన గుర్తింపు రాలేదు.
అయితే, ఈ మధ్య తమిళంలో ఆమె నటించిన ‘డ్రాగన్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా కయ్యదు లైఫ్ మారిపోయింది. ఆమె టాలెంట్‌ను గుర్తించిన దర్శకనిర్మాతలు ఇప్పుడు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సైన్ చేసిన కయ్యదు, డ్రాగన్ సినిమా కోసం తీసుకున్న రూ.30 లక్షల రెమ్యూనరేషన్ తర్వాత, అదే సినిమాతో క్రేజ్ పెరగడంతో మరో సినిమాలో రూ.70 లక్షలు అందుకుందని సమాచారం.
ఇప్పుడు శింబు, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడంతో, ఆమె రెమ్యూనరేషన్‌ను ఏకంగా రూ.2 కోట్లకు పెంచిందట. ప్రస్తుతం కయ్యదు, అధర్వతో ‘ఇదయం మురళి’, జీవీ ప్రకాశ్‌తో ‘ఇమ్మార్టల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇక శింబుతో కలిసి ఓ సినిమా, అలాగే ధనుష్ – విఘ్నేష్ రాజా కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో కూడా ఆమెను ఎంపిక చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందట.
ఈ ప్రాజెక్టులు అధికారికంగా ఖరారైతే, కయ్యదు మరింత క్రేజీ హీరోయిన్‌గా మారడం ఖాయం.
Read More : సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్ రూమర్స్‌పై మేనేజర్ క్లారిటీ.

One thought on “రెమ్యూనరేషన్ డబుల్!”
Comments are closed.