కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య ఐపీఎల్ 2025లోని 15వ మ్యాచ్ ఈరోజు (శుక్రవారం) ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ గతేడాది ఐపీఎల్ 2024 ఫైనలిస్టుల మధ్య హైవోల్టేజ్ పోరుగా మారనుంది.
గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడిన ప్రతి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సారి పరిస్థితులు మారిపోయాయి. కెప్టెన్సీ మార్పుతో పాటు కోల్‌కతా జట్టులో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మెంటార్, మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులు వచ్చాయి. అంతేకాదు, గత సీజన్‌లో అదిరిపోయిన బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఇప్పుడు జట్టులో లేడు.
ఈ నేపథ్యంలో ఈసారి SRH పాత జ్ఞాపకాలను తుడిచిపెట్టేసుకుని కేకేఆర్‌పై విజయం సాధించగలదా? కోల్‌కతా కొత్త నాయకత్వంలో పాత గెలుపుని పునరావృతం చేయగలదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read More : ISL సెమీఫైనల్: బెంగళూరు FCకు గట్టి ఆధిక్యం

One thought on “ఈడెన్ గార్డెన్స్‌లో KKR vs SRH హైవోల్టేజ్ మ్యాచ్!”
Comments are closed.