రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్ ఛార్జీ చెల్లించాలని కోరిన టోల్‌ప్లాజా ఉద్యోగిపై ఓ వాహనదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
దాడికి గురైన ఉద్యోగి, వాహనదారుడు తనపై మౌఖికంగా మరియు శారీరకంగా దాడి చేశాడని ఆరోపించాడు. పోలీసులు ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌కు చెందిన సంతోష్ గౌడ్‌గా గుర్తించారు.
పూర్తి సమాచారం కోసం అధికారుల విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Read More : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు..

One thought on “శంషాబాద్ టోల్‌ప్లాజా వద్ద టోల్ ఉద్యోగిపై వాహనదారుడి దాడి… సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డ్”
Comments are closed.