తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే భారీగా కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర excise department, వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 604 మద్యం బ్రాండ్లకు అనుమతుల కోసం దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 331 ఇండియన్ మద్యం బ్రాండ్లు కాగా, మిగిలిన 273 బ్రాండ్లు విదేశీ మద్యం బ్రాండ్లుగా గుర్తించారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ఇదొక ప్రధాన మార్గంగా పరిగణిస్తున్నారు.
మద్యం అమ్మకాల విస్తరణపై విపక్షాలు విమర్శలు చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం ప్రజల నష్టాన్ని తగ్గించేలా విధానాల అమలుకు ఈ ఆదాయ మార్గాలు అవసరమన్నదే తమ వాదనగా ముందుకు సాగుతోంది.
Read More : కవిత విమర్శలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు, అనుముల ఇంటెలిజెన్స్ వివాదం

2 thoughts on “తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు..”
Comments are closed.