హలీమ్‌పై ఎన్టీఆర్ ప్రేమ.. వెజ్‌కు చోటు లేదు!

Jr NTR

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్ వెజ్ ప్రియుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చికెన్, మటన్ బిర్యానీ అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఒకే సారి హండి మొత్తాన్ని ఖాళీ చేయగలడు. అంతే కాదు, ఎన్టీఆర్ మంచి వంటగాడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. స్నేహితులు లేదా కుటుంబసభ్యులు ఇంటికి వచ్చినా, స్వయంగా బిర్యానీ వండి వడ్డించడంలో ఎంతో ఇష్టంగా చేస్తాడు.

ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో, హైద‌రాబాద్ హలీమ్ సువాసనతో మమేకమై ఉంది. హలీమ్ అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. అయితే, హోట‌ళ్ల‌లో ఆర్డ‌ర్ చేసి తిన‌డం కన్నా, స్వయంగా వండుకోవడానికే అతను ప్రాధాన్యం ఇస్తాడట. హలీమ్ తయారీకి ఎక్కువ సమయం పట్టినా, ఎంతో ఆసక్తిగా, ప్రేమతో వండుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులకు విందుగా అందిస్తాడట.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “డ్రాగన్” చిత్రంలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో జరిగే డ్రగ్స్ మాఫియా కథగా రూపొందుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు.

అలాగే బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి “వార్ 2” లో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత, ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వనున్నాడు.

మొత్తానికి, వంటకు ఆసక్తి, కుటుంబానికి అంకితభావం, సినిమాల పరంగా అగ్రస్థానంలో కొనసాగడం – ఈ మూడు ఎన్టీఆర్ ప్రత్యేకతలు అని చెప్పొచ్చు!

Read More

One thought on “హలీమ్‌పై ఎన్టీఆర్ ప్రేమ.. వెజ్‌కు చోటు లేదు!

Comments are closed.