ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ కోసం లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన వ్యక్తి ఫిర్యాదు మేరకు భన్సాలీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, జోధ్‌పూర్‌కు చెందిన రాధా ఫిల్మ్స్ అండ్ హాస్పిటాలిటీ సీఈఓ ప్రతీక్ రాజ్ మాథుర్ బిచ్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు. ‘లవ్ అండ్ వార్’ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా తనను నియమించుకున్నారని, అధికారిక ఒప్పందం లేకపోయినా ఈ-మెయిల్ ద్వారా ధృవీకరించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు, భద్రతా ఏర్పాట్లు వంటి కీలక పనులు తానే చూసుకున్నానని, కానీ తర్వాత తనను తొలగించి, ఇవ్వాల్సిన పారితోషికం చెల్లించలేదని ఆరోపించారు.
అంతేకాక, ఆగస్టు 17న బికనీర్‌లోని హోటల్ నరేంద్ర భవన్‌లో భన్సాలీ, ఆయన బృందం తనపై దాడి చేసి దురుసుగా ప్రవర్తించారని, భవిష్యత్తులో తన కంపెనీకి అవకాశాలు రాకుండా అడ్డుకుంటామని బెదిరించారని మాథుర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నమ్మకద్రోహం, మోసం కింద కేసు నమోదు చేశారు.
మొదట పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించగా, మాథుర్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ప్రస్తుతం పోలీసులు అన్ని పక్షాల వాదనలు పరిశీలిస్తూ దర్యాప్తు జరుపుతున్నారు.
ఇక, భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల బికనీర్‌లోని జునాగఢ్ కోటలో సాగింది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, గతంలో కూడా భన్సాలీ రాజస్థాన్‌లో ‘పద్మావత్’ చిత్ర సమయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.
Read More : పవన్ కల్యాణ్ బర్త్‌డే ట్రీట్: ‘ఓజీ’ కొత్త పోస్టర్ రిలీజ్.
One thought on “సంజయ్ లీలా భన్సాలీపై ఎఫ్ఐఆర్.”
Comments are closed.