సూపర్ స్టార్ మహేష్ బాబు ఊహించని చిక్కుల్లో చిక్కుకున్నారు. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణ కోసం ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ హెడ్ క్వార్టర్స్‌కి హాజరుకావాలని ఆదేశించారు.
సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్‌పై ఈ నెల 16న ఈడీ సోదాలు నిర్వహించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. మహేష్ బాబు ప్రమోషన్ కింద రూ. 5.90 కోట్లు తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. రూ. 3.4 కోట్లు చెక్కు ద్వారా, రూ. 2.5 కోట్లు నగదు రూపంలో మహేష్ బాబు అందుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
సాయి సూర్య డెవలపర్స్ ఎండీ సతీష్ చంద్ర ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా మహేష్ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంస్థ యాడ్ లో నటించినట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
ఈ వ్యవహారం పై అధికారిక వివరాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహేష్‌పై వచ్చిన ఆరోపణలు, విచారణ ఫలితాలు ఎంత దూరం వెళ్తాయన్నది చూడాల్సి ఉంది.

One thought on “మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం”
Comments are closed.