సంగారెడ్డిలో ఫ్యాక్టరీ పేలుడు: నవదంపతుల దుర్మరణం

సంగారెడ్డి జిల్లా సిగాచి ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడులో కడపకు చెందిన నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలేపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి (24), శ్రీరమ్య (22) ఇద్దరూ పరస్పర ప్రేమించి రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కి వలస వచ్చారు. సిగాచి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగించేవారు.

ఈ క్రమంలో నిన్న (సోమవారం) ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంభవించగా, ఆ ప్రమాదంలో ఈ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యాక్టరీలోని భద్రతా లోపాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఈ ప్రమాదంతో ఇద్దరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. పెళ్లైన రెండు నెలలకే ఇలా విషాదాంతం కావడంతో గ్రామస్థులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read More : 19 జిల్లాలకు హెచ్చరికలు, మత్స్యకారులకు సూచనలు

One thought on “సంగారెడ్డిలో ఫ్యాక్టరీ పేలుడు: నవదంపతుల దుర్మరణం

Comments are closed.