తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ : భారీ ఆపరేషన్

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టులపై ఎరవేత్ ఆపరేషన్ మరింత తీవ్రతరమైంది. ముఖ్యంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో సుమారు 5000 మంది భద్రతా సిబ్బంది, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు పాల్గొంటున్నట్లు విశ్వసనీయ సమాచారం వెల్లడించింది.

కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో 300 నుంచి 400 మంది మావోయిస్టులు ఉండవచ్చని, వీరిలో హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాలను చుట్టుముట్టి, డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాత్రిపగళ్లూ భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నాయి.

Read More : ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్

One thought on “తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ : భారీ ఆపరేషన్

Comments are closed.