అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గురువారం అర్ధరాత్రి తీవ్ర విషాదం నెలకొంది. శాన్ డియాగో నగర శివార్లలో ఓ చిన్న విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటన సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదం స్కల్పిన్ స్ట్రీట్, శాంటో రోడ్ సమీపంలో చోటుచేసుకోగా, విమానంలోని ఇంధనమే మంటలకు కారణమై 15 ఇళ్లు, అనేక కార్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పరిసరాలను ఖాళీ చేయించి, ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లకుండా నివారించారు.
ప్రమాదానికి గురైన విమానం “సెస్నా” తరహాకు చెందినదిగా గుర్తించామని శాన్ డియాగో అగ్నిమాపక శాఖ సహాయ ప్రధాన అధికారి వెల్లడించారు. విమానం శకలాలు పెద్ద ఎత్తున చెల్లాచెదురుగా పడిపోయినట్లు తెలిపారు. ఇంకా ఎంతమంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్థానిక అధికారులు ప్రకటించారు.
Read More : సైన్యంతో సంబంధంపై స్పష్టత

One thought on “జనావాసాల్లో కుప్పకూలిన చిన్న విమానం”
Comments are closed.