రైలు పట్టాలపై రీల్స్‌ షాక్..

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమ్ కోసం యువత చూపిస్తున్న అతి మరీ దురాశ భయంకరంగా మారుతోంది. తాజాగా ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని వీడియో తీసుకుంటూ రీల్ రూపొందించేందుకు యత్నించాడు. ఈ వీడియోపై సైబర్‌ క్రైమ్ స్పెషలిస్ట్‌, మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“సోషల్ మీడియా మత్తులో మునిగిపోయిన మానసికంగా అస్థిరమైన యువతకు కౌన్సిలింగ్ తప్పనిసరి” అని సజ్జనార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. “ఒకవేళ ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే బాధను ఊహించడానికైనా వీరు సిద్ధంగా లేరు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సజ్జనార్ వ్యాఖ్యలు యువతకు బుద్ధి చెబుతూ మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఫేమ్ కోసం జీవితం ప్రమాదంలో పడేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

Read More : మంద కృష్ణ మాదిగ విమర్శలు..?

One thought on “రైలు పట్టాలపై రీల్స్‌ షాక్..

Comments are closed.