పాన్ ఇండియా ట్రెండ్ ప్రభావంతో సినిమా మేకర్స్ భారీ బడ్జెట్ ఖర్చు చేయడాన్ని పెంచేశారు. ఈ క్రమంలో పాటల కోసం కోట్లలో ఖర్చు పెట్టడం కొత్త నార్మ్‌గా మారింది. సాధారణంగా సినిమా పాటల్లో కొన్ని పది మంది డ్యాన్సర్లు ఉంటే, తాజాగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు పాల్గొనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
1947 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం సాయి దుర్గ తేజ్ పూర్తి మేకోవర్‌లో కనిపించనున్నాడు. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 65% షూటింగ్ పూర్తయ్యింది. రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ విపరీతమైన హైప్‌ను సృష్టిస్తోంది.
మొన్నటివరకు యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్న సాయి దుర్గ తేజ్, ఇప్పుడు డ్యాన్స్ ఫ్లోర్‌పై దుమ్మురేపేందుకు సిద్ధమయ్యాడు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ గ్రాండ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది, దీనికి సంబంధించిన బడ్జెట్, విజువల్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి!

One thought on “సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ పాట షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది!”
Comments are closed.