మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పోరాటాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే, శాంతికి పుతిన్ పలు కఠినమైన షరతులు విధించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ప్రధానంగా ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాటో కూటమిలో చేరకూడదని పుతిన్ డిమాండ్ చేశారు. నాటో విస్తరణను తక్షణమే నిలిపివేయాలని, దీనిపై లిఖితపూర్వక హామీ కావాలని ఆయన కోరుతున్నారు. అలాగే ఉక్రెయిన్‌తో పాటు జార్జియా, మోల్డోవా వంటి మాజీ సోవియట్ దేశాలకు కూడా నాటో సభ్యత్వం ఇవ్వకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ షరతులతో పాటు ఉక్రెయిన్ తటస్థంగా వ్యవహరించాలి, రష్యాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి, స్తంభింపజేసిన రష్యన్ ఆస్తుల సమస్యను పరిష్కరించాలి, ఉక్రెయిన్‌లోని రష్యన్ భాషాభిమానులకు రక్షణ కల్పించాలి అనే డిమాండ్లు కూడా పుతిన్ ముందుంచినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
ఇక శాంతి చర్చల ప్రతిపాదనలు వెలువడుతున్నా, రష్యా దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో నాలుగు సరిహద్దు గ్రామాలను రష్యా సైన్యం ఆక్రమించింది.
ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేకపోతే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి త్రైపాక్షిక చర్చలకు తాను సిద్ధమని చెప్పారు. అదే సమయంలో, రష్యా శాంతికి ముందుకురాకపోతే, ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని అమెరికాకు విజ్ఞప్తి చేశారు.
Read More : చెదరిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్

One thought on “రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి..కానీ షరతులు: పుతిన్.”
Comments are closed.