రష్యా తూర్పు ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో సునామీకి దారితీసింది. దీని ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిన అలలు జపాన్ తీరాలను దాటేశాయి. సముద్రగర్భంలో సంచరించిన భారీ తిమింగలాలు కూడా అలలతో తీరానికి కొట్టుకొచ్చాయి. జపాన్‌లోని చింబా తీరానికి నాలుగు భారీ తిమింగలాలు తేలియాడుతూ కనిపించగా, వాటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సునామీ కారణంగా ఫుకుషిమా డయీచీ అణు కేంద్రం నుంచి ఉద్యోగులను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పసిఫిక్ తీరంలోని పలు దీవులను అలలు ముంచెత్తాయి. టొకచాయ్ పోర్టులో 40 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడగా, హన్సంకి, ఎరిమో పట్టణాల్లో 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు నమోదయ్యాయి.
థోకు, కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు తాకడంతో తీరప్రాంతాల్లోని ఎయిర్‌పోర్టులకు జపాన్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. సెండాయ్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి, విమానాలను దారిమళ్లించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
Read More : శ్రీహరికోట నుంచి నేడు నిసార్ ఉపగ్రహం ప్రయోగం
