రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. 2011 తర్వాత ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే మొదటిసారి అని నిపుణులు వెల్లడించారు. భూకంపం కారణంగా సంబంధిత అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికల తర్వాత కొద్ది సమయంలోనే రష్యా, జపాన్ తీరాలను సునామీ తాకింది.
కంచట్కా, పెట్రోపావ్లోవ్‌స్క్ నగరాల్లో భవనాలు తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్, మొబైల్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని రష్యా మీడియా తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టమైన సమాచారం ఇంకా తెలియరాలేదు.
రష్యాలోని కురిల్ దీవులు, జపాన్‌లోని హక్వైడో తీరప్రాంతాలు సునామీ ప్రభావానికి గురయ్యాయి. హోనోలులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగించడంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More : ప్రాక్టర్ & గాంబుల్ కొత్త సీఈవోగా శైలేష్ జేజూరికర్

2 thoughts on “రష్యాను 8.8 తీవ్రత భూకంపం కుదిపేసింది”
Comments are closed.