ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సమావేశంలో వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఈ విషయంపై చివరి నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ముంబయికి చెందిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ భారత జట్టుకు ఒక్కటి కాదు, రెండు ఐసీసీ టైటిల్స్ అందించటం గమనార్హం. ఈ గొప్ప విజయాల దృష్ట్యా ఆయనకు గౌరవంగా వాంఖడేలో ఒక స్టాండ్‌ను అంకితంగా ఇచ్చే విషయాన్ని MCA పరిశీలిస్తోంది.
త్వరలో సమావేశం నిర్వహించి, దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Read More : హ్యారీ బ్రూక్ ను ఇంగ్లాండ్ వైట్‌బాల్ కెప్టెన్‌గా నియమించిన కీలక నిర్ణయం..
