స్టార్ హీరోల సినిమాలు ఇంకా షూటింగ్ దశలో ఉండటంతో, ఇటీవల ఎక్కువగా యంగ్ హీరోల సినిమాలే విడుదల అవుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌లతో పాటు ఓటీటీలో కూడా వీటి ప్రభావం కనిపిస్తోంది. ఈ వారం కూడా చిన్న సినిమాలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరికొన్ని ఓటీటీ రిలీజ్‌లు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘షణ్ముఖ’ ఈ వారం విడుదల కానుంది. ఇది డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కగా, ఇప్పటివరకు టచ్ చేయని కొత్త కథాంశంతో రూపొందించారని దర్శకుడు షణ్ముగం సాప్పని తెలిపారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఈ నెల 21న విడుదల అవుతోంది. అలాగే, సప్తగిరి హీరోగా నటించిన ‘పెళ్లికాని ప్రసాద్’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి విషయంలో సవాళ్లు ఎదుర్కొన్న యువకుడి కథ ఇది.
కొత్త నటీనటులతో సుప్రీత్ కృష్ణ తెరకెక్కించిన ‘టుక్ టుక్’ కూడా ఈ నెల 21న విడుదల కానుంది. ఆటోలా కనిపించే మ్యూజికల్ పవర్స్ ఉన్న స్కూటర్ చుట్టూ సాగే వినోదాత్మక కథ ఇది. అలాగే, ‘అనగనగా అస్ట్రేలియాలో’, ‘ఆర్టిస్ట్’ వంటి చిన్న చిత్రాలతో పాటు, బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్ 2 పప్పీ’ తెలుగులో ‘కిస్ కిస్ కిస్సిక్’ పేరుతో అదే రోజున రిలీజ్ అవుతోంది.
అలాగే, ఈ వారం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘సలార్: సీజ్ ఫైర్’ సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాల లేనందున, థియేటర్లు అన్ని సినిమాలకు సమానంగా స్పేస్ కేటాయించాయి. చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మంచి వసూళ్లు సాధించే అవకాశముంది. ప్రేక్షకులు కంటెంట్‌ను ప్రధానంగా చూసే ట్రెండ్ కొనసాగుతుండటం, ఈ సినిమాలకు కలిసి వచ్చే అంశం.

One thought on “ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల హవా”
Comments are closed.