రంగారెడ్డి జిల్లా, మంచిరేవులలో నిర్వహించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో పలువురు నాయకుల వ్యక్తిత్వాన్ని, వారి పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నాయకుల గొప్పతనాన్ని గుర్తు చేశారు.
విద్యకు ప్రాధాన్యం – యువతకు భరోసా
ఈ సందర్భంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పోలీస్ స్కూల్ అంశాన్ని ముందుగానే ప్రతిపాదించామని, ఇది పోలీస్ సిబ్బందికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు తరగతులలోనే తలదాచుకుంటుందని భావిస్తూ, విద్య, ఉపాధిని తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. ఈ దిశగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైందని తెలిపారు.
ప్రతీ నాయకుడికి ఒక బ్రాండ్
రెవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించారు. ఐటీ అభివృద్ధి ద్వారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌నే బ్రాండ్ cityగా మార్చారు. రైతు బాంధవుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తింపు పొందారు. అలాగే నేను ‘యంగ్ ఇండియా’ అనే బ్రాండ్‌ను మహాత్మా గాంధీ స్ఫూర్తితో రూపొందించాను,” అని చెప్పారు.
అనంద్ మహేంద్ర ఛైర్మన్‌గా నియామకం
యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రను చైర్‌పర్సన్‌గా నియమించినట్టు వెల్లడించారు. ఈ యూనివర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉండే విధంగా రూపొందించినట్టు పేర్కొన్నారు. వచ్చే ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా చేయనున్నట్టు తెలిపారు.
ప్రత్యేక నిధులు – సామాజిక బాధ్యత
పోలీస్ స్కూల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి అవసరమైన అనుమతులను ప్రభుత్వం వెంటనే ఇవ్వనున్నదని తెలిపారు. అలాగే ప్రైవేటు కంపెనీలు సామాజిక బాధ్యతగా పోలీస్ స్కూల్‌కు ఆర్థికంగా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Read More : CEC కి 200 పేజీల నివేదిక సమర్పించిన BRS నేతలు: HCU
