గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో అక్రమ నిర్మాణాలు వేగంగా పెరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టినా, ఈ సమస్య అదుపులోకి రాకపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఒక వ్యక్తి రహదారిని ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మిస్తున్నట్లు సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారులకు సమాచారం అందింది.
వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని స్థలం కొలతలు తీసేందుకు ప్రయత్నించగా, స్థల యజమాని వారిని అడ్డుకున్నారు. అంతేకాకుండా, కత్తి చూపి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక నగరం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
Read More : మూసీ ప్రాజెక్ట్‌కి భారీ వరద నీరు

One thought on “బంజారాహిల్స్‌లో టౌన్ ప్లానింగ్ అధికారులకు కత్తి బెదిరింపు”
Comments are closed.