కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ తన విచారణను మళ్లీ ప్రారంభించబోతోంది. శుక్రవారం నుంచి ఈ విచారణ కొనసాగనుండగా, ఇందులో భాగంగా మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు.
ఈటల రాజేందర్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, అప్పులు, చెల్లింపులు వంటి అంశాలపై కమిషన్ ప్రశ్నలు వేయనుంది. ఇప్పటికే చైర్మన్ పీసీ ఘోష్ ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఖజానా నుంచి ప్రాజెక్టుకు చెల్లించిన బిల్లులు, పాటించిన నిబంధనలపై కమిషన్ లోతుగా పరిశీలన జరుపుతోంది.
వివరాల్లోకి వెళ్తే, కాళేశ్వరం నిర్మాణ సమయంలో కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది. ఈ అంశంపై ఈటల రాజేందర్‌ను ప్రశ్నించనుంది. ఆయన ఏం సమాధానమిస్తారన్న ఆసక్తి నెలకొంది.
ఇక జూన్ 9న మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరుకానుండగా, జూన్ 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ముందు జూన్ 5న విచారణకు రావాలని కమిషన్ నోటీసు ఇచ్చినప్పటికీ, మరింత సమయం కావాలని కోరడంతో జూన్ 11కు వాయిదా వేసింది.
ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, రిటైర్డ్ అధికారుల అఫిడవిట్లు తీసుకున్న కమిషన్, కాగ్ నివేదిక, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను కూడా పరిగణలోకి తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో జరిగిన నిర్మాణ లోపాలు, డిజైన్ లో ఖామీలు, నాణ్యతలపై విచారణ సాగుతోంది.
ఈనెలాఖరులోగా తుది నివేదికను ప్రభుత్వంకు సమర్పించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
Read More : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

One thought on “కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభం.”
Comments are closed.