బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, 50 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్ కమిషన్ సమర్పించిన నివేదికలో… తొక్కిసలాటకు ప్రధాన కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థ, అలాగే బెంగళూరు నగర పోలీసుల** నిర్లక్ష్యమే అని స్పష్టం చేసింది. ఈ సంస్థలు తగినంత చర్యలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి దారితీసిందని కమిషన్ అభిప్రాయపడింది.
నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అధికారికంగా అందజేశారు. ఇప్పుడు ఈ ఘటనపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. బాధితులకు న్యాయం కలిగించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ మృతుల కుటుంబాలు కోరుకుంటున్నాయి.
Read More : ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రా
