లార్డ్స్: 3వ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు లార్డ్స్ లో జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఐదు వికెట్లు తీసి తన పేరును ‘ఆనర్స్ బోర్డు’ పై లిఖించుకున్నాడు. నిలకడైన బౌలింగ్ తో ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రా పై ఎక్కడ చూసిన ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐదు వికెట్లు తీసిన తర్వాత లాంగ్ రూమ్ లోకి వచ్చిన బుమ్రాకు ఘన స్వాగతం లభించింది. ఈసందర్భంగా రిషబ్ పంత్ తోపాటు పలువురు అభిమానులు బుమ్రా ప్రదర్శనపై స్పందించారు. ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో మీరు చూసేయండి…
Read More : హెచ్‌సీఏ స్కాంపై ఈడీ దర్యాప్తు ప్రారంభం

One thought on “ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రా”
Comments are closed.