కర్ణాటక రాయచూర్ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. సెల్ఫీ తీసుకుందామని చెప్పి ఒక మహిళ తన భర్తను నదిలోకి తోసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నదిపై వంతెన వద్ద సెల్ఫీ తీసుకుందామని భార్య చెప్పడంతో భర్త ముందుకెళ్లాడు. అదే సమయంలో ఆమె అనూహ్యంగా అతన్ని నదిలోకి తోసేసింది. కొట్టుకుంటూ కొంత దూరం వెళ్లిన భర్త ఒక రాయిపై చిక్కుకున్నాడు. దీనిని గమనించిన గ్రామస్థులు తాడు సాయంతో అతడిని బయటికి లాగి ప్రాణాలను కాపాడారు. పరిస్థితి చక్కదిద్దిన తర్వాత గ్రామస్థులు “ఎందుకు దూకావు?” అని అడగ్గా, “నేను దూకలేదు.. నా భార్యే తోసింది” అని బాధితుడు చెప్పినట్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Read More : సీఎం కుర్చీపై డీకే మనసులో మాట

One thought on “సెల్ఫీ పేరుతో భర్తను నదిలో తోసిన భార్య”
Comments are closed.