సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ ఎప్పుడూ గ్రేస్‌ఫుల్ ఫ్యాషన్‌కు పెద్ద అభిమానిగా నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లుక్ ఆమె స్టైల్ సెన్స్‌కు మరో నిదర్శనం. మణీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ప్రత్యేకమైన లాంగ్ జాకెట్ డ్రెస్‌లో ఆమె మహారాణిలా మెరిసిపోయారు.
నమ్రతా శిరోద్కర్ ధరించిన ఈ డ్రెస్ గోల్డెన్ ఎంబ్రాయిడరీతో కూడిన ఐవరీ కలర్‌లో మెరిసిపోతోంది. స్టాండ్ కాలర్, స్లీవ్స్ చివర్లో సాఫ్ట్ కట్స్‌తో ఉన్న ఈ లాంగ్ స్ట్రక్చర్డ్ డ్రెస్ సాంప్రదాయ శైలి మరియు ఆధునికత కలబోసిన మేళవింపు. బాటమ్ స్ట్రైట్ కట్, కష్టమ్ ఫిట్ స్లీవ్స్, మధ్యలో బెల్ట్‌తో ఈ డ్రెస్ మరింత ప్రత్యేకంగా నిలిచింది.
నమ్రతా షిమ్మరీ గోల్డెన్ ఐషాడో, పొడవైన లాషెస్, న్యూడ్ లిప్ షేడ్, మిడిల్ పార్టెడ్ హేర్ స్టైల్‌తో తన లుక్‌ను మేటిగా తీర్చిదిద్దారు. ఎమరాల్డ్ డ్రాప్ ఈరింగ్స్ ఆమె లుక్‌ను మరింత హైలైట్ చేశాయి.
సాంప్రదాయ దుస్తులను గ్రేస్‌ఫుల్‌గా స్టైల్ చేయడంలో నమ్రతా శిరోద్కర్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు.


One thought on “నమ్రతా శిరోద్కర్ స్టైలిష్ లుక్ – మణీష్ మల్హోత్రా క్రియేషన్‌లో రోయల్ ఛార్మ్!”
Comments are closed.