రమ్యశ్రీపై సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరుల దౌర్జన్యం

హైదరాబాద్ గచ్చిబౌలిలో సినీనటి రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడిపై జరిగిన దాడి ఘటన కలకలం రేపుతోంది. ఈ దాడికి సంబంధించి సంధ్య కన్వెన్షన్ సెంటర్ యజమాని శ్రీధర్ రావుతో పాటు వెంకటేష్, మరో ముగ్గురు అనుచరులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ ఘటనపై పోలీసులు భారత న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 115(2), 126(2), 324(5), 125 R/W 3(5) ప్రకారంగా కేసులు నమోదు చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే… హైడ్రా అధికారుల సమక్షంలో రోడ్లను మార్కింగ్ చేస్తున్న సమయంలో వీడియోలు తీస్తున్న ప్లాట్ ఓనర్లపై శ్రీధర్ రావు అనుచరులు దాడికి దిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో రమ్యశ్రీతోపాటు ఆమె సోదరుడు కూడా గాయపడ్డట్టు సమాచారం.

శ్రీధర్ రావు అనుచరుడు వెంకటేష్ అత్యంత వేగంగా కారు నడిపి తనను ఢీకొట్టబోయాడని, అలాగే తిరిగి వెళ్తుండగా TS 36 1085 నంబర్ కలిగిన బైక్ పై వచ్చిన వ్యక్తులు కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

శ్రీధర్ రావు మరియు వెంకటేష్ ఆదేశాలతోనే తనపై దాడి జరిగినట్లు బాధితుడు పోలీసులకు తెలియజేశాడు. అంతేకాకుండా, శ్రీధర్ రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదులో స్పష్టం చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Read More : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై యువతి ఆత్మహత్యతో కలకలం

One thought on “రమ్యశ్రీపై సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరుల దౌర్జన్యం

Comments are closed.