పెళ్లి పేరు చెప్పి యువతిని మోసంచేసినా యువకుడు..

హైదరాబాద్‌లోని యువతిని పెళ్లి మాటలతో నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగళూరుకు చెందిన వేలూరి శశాంక్ అనే యువకుడిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే…

అమీర్‌పేట్‌కు చెందిన ఓ యువతిని బెంగళూరులో జరిగిన కామన్ ఫ్రెండ్స్ మీటింగులో కలిసిన శశాంక్, మొదటి నుంచే ప్రేమ, పెళ్లి మాటలతో ఆమెను ఆకట్టుకున్నాడు. వారి మధ్య సంబంధం గాఢమవుతూ చివరకు శశాంక్ యువతిని శారీరికంగా లోబరచుకున్నాడు.

తర్వాత ఉన్నత విద్య కోసం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వెళ్లి వస్తానని, తిరిగొచ్చాక పెళ్లి చేసుకుని విదేశాలకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ యూకే వెళ్లిన తరువాత యువతిని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి, SR నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా శశాంక్ యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మోసం, నేర నైతికతలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read More : లయోలా కాలేజ్‌ ఉద్యోగాల మోసం..

One thought on “పెళ్లి పేరు చెప్పి యువతిని మోసంచేసినా యువకుడు..

Comments are closed.