చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని జాయింట్ డాక్యుమెంట్‌లో చేర్చకపోవడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆ సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి రాజ్‌నాథ్ నిరాకరించారు. సదస్సులో ఉగ్రవాదంపై రాజ్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై ఎస్‌సీవో సభ్యులు నిర్ధారితంగా స్పందించాల్సిన అవసరాన్ని ఆయన వెల్లడించారు. అయితే, అనంతరం విడుదల చేసిన జాయింట్ డాక్యుమెంట్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో భారత్ తన అంగీకారాన్ని వెనక్కి తీసుకుంది.
ఈ చర్యతో ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం జాయింట్ స్టేట్‌మెంట్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ ఉగ్రవాదంపై తన ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని మరోసారి స్పష్టంగా తెలిపింది.
Read More : రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ?
