రికవరీ వ్యాన్ డ్రైవర్ మృతి, మరొకరు గాయపడిన ఘటన.

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తూనే ఉన్నా, మరొక ప్రాంతంలో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడింది.

వివరాల్లోకి వెళ్తే, రాజేంద్రనగర్ అవుటర్ రింగు రోడ్డుపై టయోటా కారు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన మరో కారు టైరు మార్చేందుకు రికవరీ వ్యాన్ చేరుకోవడంతో, టయోటా కారు వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రికవరీ వ్యాన్ డ్రైవర్ శివ కేశవ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం.

పోలీసులు ఈ ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పేర్కొన్నారు. ఈ ఘటనలో మూడు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More : ప్రజల్లో అవగాహన పెంపుదల లక్ష్యం

One thought on “రికవరీ వ్యాన్ డ్రైవర్ మృతి, మరొకరు గాయపడిన ఘటన.

Comments are closed.