జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులతో భద్రతా బలగాలు ఎదురెదురుగా నిలిచాయి. షోపియాన్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడే చిక్కుకుని ఉండవచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

భద్రతా దళాలకు ఓ విశ్వసనీయ సమాచారం అందింది. షోపియాన్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నారని తెలిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని ముట్టడి చేసి గాలింపు ప్రారంభించారు. దళాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా తిరిగి కాల్పులకు దిగాయి.

ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. ప్రస్తుతానికి మిగతా ఉగ్రవాదుల కోసం ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా ముట్టడి చేసి కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఆ పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Read More : ముంబయిలో బాంబు బెదిరింపు: పోలీసుల దర్యాప్తు.