భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఎన్నికల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయని ఆరోపించారు. ఈసీఐ పాక్షికంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతం సంబంధించి చోటుచేసుకున్న అనుమానాస్పద గణాంకాలను ఉదాహరణగా చూపిన రాహుల్, “సాయంత్రం 5:30 నాటికి ప్రకటించిన ఓటింగ్ శాతం, 7:30 నాటికి నమోదు చేసిన శాతానికి మధ్యలో సుమారు 65 లక్షల ఓట్లు తేడాగా కనిపించాయి. కేవలం రెండు గంటల్లో అంత భారీగా ఓట్లు పోలవడం అసాధ్యం. ఒక ఓటరు ఓటేయడానికి కనీసం మూడు నిమిషాలు పడుతుంది. ఆ లెక్కన పోలింగ్ అర్థరాత్రి దాకా సాగాల్సింది” అని విమర్శించారు.
అంతేకాదు, ఈ విషయంపై స్పష్టత కోరుతూ ఈసీఐని వీడియోగ్రఫీ విడుదల చేయాలని డిమాండ్ చేశామని, కానీ ఎన్నికల సంఘం తమ డిమాండ్‌ను నిరాకరించిందని ఆరోపించారు. ఈ వీడియోలను అడిగే హక్కు లేకుండా చట్టాన్ని కూడా మార్చారని మండిపడ్డారు.
Read More : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో భారత్ పర్యటన..
