బీహార్‌లో రాహుల్ యాత్రలో స్టాలిన్ హాజరు – బీజేపీ ఘాటు విమర్శలు

బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. ఆయన పర్యటనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేగింది. స్టాలిన్ యాత్రలో పాల్గొనడంపై బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. గతంలో డీఎంకే నేతలు బీహారీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, స్టాలిన్ పర్యటనను కపట రాజకీయమని బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి స్టాలిన్ ఒకే వాహనంలో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బీజేపీ నేత అన్నామలై ఘాటుగా స్పందిస్తూ, స్టాలిన్ మరియు డీఎంకే గత వ్యాఖ్యలను ఇప్పుడు బీహార్ ప్రజల ముందు చెప్పగలరా? అని ప్రశ్నించారు. స్టాలిన్ పర్యటన బీహారీలపై డీఎంకేకున్న అసహనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమేనని ఆరోపించారు.

ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ యాత్రలో డీఎంకే ఎంపీ కనిమొళి కూడా పాల్గొన్నారు. ఆమె సోషల్ మీడియాలో రాహుల్, స్టాలిన్, తేజస్వితో ఉన్న ఫొటోను పంచుకుంటూ, “ఈ ముగ్గురే భారత భవిష్యత్తు. బీజేపీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి కలిసి పోరాడుతోంది” అని పేర్కొన్నారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది.

Read More : ముంబైలో సరికొత్తగా గణపతి ఊరేగింపు

One thought on “బీహార్‌లో రాహుల్ యాత్రలో స్టాలిన్ హాజరు – బీజేపీ ఘాటు విమర్శలు

Comments are closed.