ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్ టారిఫ్ ప్లాన్లను పెంచుతున్న తరుణంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చవకైన కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రవేశపెట్టిన రూ.147 ప్లాన్‌తో కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అదనంగా 10 జీబీ హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తున్నారు. రోజుకు కేవలం రూ.5 ఖర్చుతో ఈ సౌకర్యాలు వినియోగదారుల చేతికి అందుతున్నాయి.
అయితే, కేటాయించిన 10 జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అందువల్ల అధికంగా డేటా వాడే వారికి ఇది అంతగా అనుకూలం కాకపోవచ్చు. కానీ ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా చేసే వినియోగదారులకు ఈ ప్లాన్ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
పెరుగుతున్న రీఛార్జ్ ధరల మధ్య బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ సాధారణ వినియోగదారులను ఆకర్షిస్తోంది.
Read More : మీ కోసం కొన్ని తాజా టెక్నాలజీ వార్తలు:
