‘పుష్ప 2’ బాక్సాఫీస్‌పై సంచలన విజయం – జాతర పాటపై దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

pushpa-2-box-office-jathara-song-allu-arjun

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. హిందీ వర్షన్ ₹1000 కోట్లు వసూలు చేయగా, వరల్డ్‌వైడ్‌గా ₹1900 కోట్ల కలెక్షన్లు నమోదు చేసింది. భారతీయ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది.

సినిమాలో ‘జాతర’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను మొదట ఒక నిమిషం నిడివితో ప్లాన్ చేసినా, చివరికి గ్రాండ్‌గా రీట్యూన్ చేసి చిత్రీకరించామని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. అల్లు అర్జున్ ఈ పాటలో చూపిన అద్భుతమైన ఎమోషన్స్ వల్ల ఆయనకు జాతీయ అవార్డు ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఈ పాట కోసం అల్లు అర్జున్ చీరకట్టులో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. స్టార్ హీరోలు సాధారణంగా ఇలాంటి గెటప్‌ను అంగీకరించరు. అయితే బన్నీ ఈ పాత్రలో పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పాట విజువల్స్‌లో సెట్, బ్యాక్‌గ్రౌండ్, మ్యూజిక్ అన్నీ కలిసి అద్భుతంగా కుదిరాయని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుండగా, మరో ముగ్గురు నాయికలు కూడా భాగమవ్వనున్నారు.

Read More

One thought on “‘పుష్ప 2’ బాక్సాఫీస్‌పై సంచలన విజయం – జాతర పాటపై దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Comments are closed.