పుణెలో డొమినోస్ ఎదుట నిరసన..

పుణె నగరంలో డొమినోస్ ఫాస్ట్‌ఫుడ్ కేంద్రం ముందు పాలస్తీనాకు మద్దతుగా కొందరు యువకులు నిరసన చేపట్టారు. “డొమినోస్ బాయ్‌కాట్” అనే నినాదాలతో వారు షాపు ఎదుట బైఠాయించారు. గాజాలో సైనిక కార్యకలాపాల సమయంలో ఇజ్రాయెల్ సైనికులకు డొమినోస్ ఆహారం సరఫరా చేసిందని ఆరోపిస్తూ, వారు ఈ నిరసన చేపట్టారు.

ఈ నేపథ్యంలో కొందరు నిరసనకారులను పాకిస్తాన్‌కు మద్దతుదారులుగా అనుమానించిన మరికొందరు అక్కడే చర్చకు దిగడంతో ఘర్షణ జరిగింది. తక్కువ సమయంలోనే ఉద్రిక్తత ఏర్పడి మాటల యుద్ధం ముదిరింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చింది.

పాలస్తీనా పట్ల మద్దతు వ్యక్తం చేస్తున్నంత మాత్రానా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నారని అనుమానించడం తగదని పలువురు ప్రశ్నిస్తున్నారు. డొమినోస్ వ్యవహారంపై స్పందన రావాల్సి ఉంది.

Read More : పీవీ నరసింహారావు విగ్రహం ఢిల్లీలో ఏర్పాటు: