కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎక్కడికక్కడ స్వల్ప ఉద్రిక్తతలు మినహా, పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి పెద్ద సమస్యలు ఎదురుకాలేదు. భద్రతా చర్యల కోసం 1,400 మంది పోలీసులు మోహరించబడ్డారు.
అయితే, పులివెందుల మండలం కణంపల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు కారులో వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కారుకు నష్టం కలిగించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేశారు.
Read More : పులివెందుల ZPTC ఉప ఎన్నిక: ఉద్రిక్త పరిస్థితులు

One thought on “స్వల్ప ఉద్రిక్తతలతో ప్రశాంతంగా కొనసాగింపు”
Comments are closed.