పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
వైసీపీ ఆరోపణలు:
వైసీపీ నాయకులు టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు కర్రలు పట్టుకుని తమ కార్యకర్తలను, ఓటర్లను బెదిరిస్తున్నారని, ఓటర్లను ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ అక్రమాలను పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.
టీడీపీ ఆరోపణలు:
మరోవైపు టీడీపీ నేతలు వైసీపీపై ఎదురుదాడి చేశారు. తమ పార్టీకి ఓట్లు పడకుండా వైసీపీ నాయకులు దాడులకు యత్నిస్తున్నారని, పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలకు దిగుతున్నారని ఆరోపించారు.
ఈ పరస్పర ఆరోపణలు, ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఉద్రిక్తంగా కొనసాగుతోంది.
Read More : ఏపీలో ‘ఓట్ చోర్’ క్యాంపెయిన్: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

One thought on “పులివెందుల ZPTC ఉప ఎన్నిక: ఉద్రిక్త పరిస్థితులు”
Comments are closed.