ఇకనుంచి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయను

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో సుమారు ఐదు గంటలపాటు విచారణ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌కి బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక లాభాలు, ప్రచార ఒప్పందాలపై అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎలాంటి ఆర్థిక లాభం పొందలేదు. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకోలేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి యాప్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేయను” అని స్పష్టం చేశారు.

తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ సహా పలువురు సినీ ప్రముఖులకు ఇటీవల ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లతో కలిసి మొత్తం 29 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఈడీ విచారణ పూర్తయిన తర్వాత ప్రకాశ్‌రాజ్ సాయంత్రం కార్యాలయం నుంచి బయలుదేరగా, ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.

Read More : కాంతలో భాగ్యశ్రీ పాత్ర… కీర్తిని గుర్తు చేస్తుందా?

One thought on “ఇకనుంచి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయను

Comments are closed.