పెద్దమ్మ గుడి కూల్చివేతపై రాజాసింగ్ ఆగ్రహం

బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేత ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఆలయం కూల్చివేత జరిగిందని తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆయనను పోలీసులు ఆపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. “మిగతా నేతలను లోపలికి అనుమతించి నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకున్నారు?” అని ప్రశ్నించిన రాజాసింగ్, ఆలయం కూల్చివేతకు ఆదేశించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడిన రాజాసింగ్, “బీజేపీ అంటే ఇప్పటికీ నాకు ప్రాణమే. పార్టీ నాయకులు నన్ను పక్కన పెట్టి ఉండొచ్చు కానీ నేను పార్టీని ఎప్పటికీ పక్కన పెట్టలేదు” అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.