భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు మోదీ, వైఎస్ జగన్ శుభాకాంక్షలు

భారత్ గర్వించదగ్గ సమయం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వ్యోమగామి శుభాంశు శుక్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఇక, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా తిరిగి రావటంపై హర్షం వ్యక్తం చేశారు. శుభాంశుతోపాటు ఆయన బృందంకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇది భారత్ గర్వించదగిన సమయం అంటూ ట్వీట్ చేశారు.

యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. 18 రోజులపాటు ఐఎస్ఎస్ లో గడిపిన శుక్లా బృందం.. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నం భూమ్మీదకు స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సురక్షితంగా తిరిగొచ్చింది. దీంతో ఇస్రో వర్గాలు సంబురాల్లో మునిగితేలాయి.