ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘రాజాసాబ్’ మూవీ టీజర్ విడుదలైంది. క్రేజీ డైరెక్టర్ మారుతి, డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ కామెడీ హారర్ జోనర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ అంచనాలను అందుకునేలా ఉందని చెప్పొచ్చు.
టీజర్‌లో వింటేజ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ లుక్ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆయన స్టైల్, నడక, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకర్షించగా, హారర్ ఎలివేషన్స్‌తో కూడిన సన్నివేశాలు టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభాస్ చెప్పిన కొన్ని హాస్యాత్మక డైలాగులు ప్రేక్షకుల్లో నవరసాలు రేపాయి.
మరోవైపు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. హారర్ సీన్లకు సరైన థ్రిల్‌ను అందించడంలో తమన్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. థియేటర్‌లో ఈ సన్నివేశాలు మరింత గొప్ప అనుభూతిని ఇస్తాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టు డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌కు విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో మూవీపై హైప్ మరింత పెరిగింది.
Read More : ‘రానా నాయుడు 2’ రివ్యూ

One thought on “ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ విడుదల”
Comments are closed.