ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఒకవేళ అణుదాడికి దిగితే, పాకిస్థాన్ తక్షణమే ఇజ్రాయెల్‌పై అణుబాంబు వదులుతుందని ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ సైనిక అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) జనరల్ మొహసిన్ రెజాయి ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
“ఇజ్రాయెల్ ఒకవేళ మా దేశంపై అణుదాడి చేస్తే, టెల్ అవీవ్‌పై అణుబాంబు ప్రయోగించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని స్పష్టమైన హామీ మాకు లభించింది” అని ఇరాన్ జాతీయ భద్రతా మండలిలో సభ్యుడైన రెజాయి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అదనంగా, టర్కీ, సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ వంటి దేశాలతో కలిసి ఉమ్మడి ఇస్లామిక్ సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం ఆ దేశాలు ఇలాంటి ఆర్మీ ఏర్పాటుకు పూర్తిగా సుముఖంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ దేశాల్లో ఏదైనా అంగీకారం తెలిస్తే, రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయని హెచ్చరించారు.
Read More : ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 224 మంది మృతి

One thought on “ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు”
Comments are closed.