హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేసిన జిమ్ ట్రైనర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి 2019లో సినిమారంగంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేయడానికి హైదరాబాద్‌కు వచ్చింది. 2020లో గాయత్రి హిల్స్‌లో ఉంటున్న జిమ్ ట్రైనర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
కాలక్రమేణా వారి పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. కొంతకాలానికే జిమ్ ట్రైనర్ యువతిని దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని అతనికి ఆసక్తి లేదని గ్రహించిన యువతి స్వగ్రామానికి వెళ్లిపోయింది.
అయితే 2023 నవంబర్‌లో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను జిమ్ ట్రైనర్ మరోసారి పెళ్లి చేసుకుంటానని నమ్మించసాగాడు. పెళ్లికి అవసరమని చెబుతూ రూ.15 లక్షలు అడిగాడు. అతనికి పూర్తిగా నమ్మిన బాధిత యువతి డబ్బును అందించింది. కానీ డబ్బు తీసుకున్న తర్వాత అతను మళ్లీ దూరంగా వ్యవహరించడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో అతని గురించి విచారణ చేపట్టిన యువతికి అతనికి ఇప్పటికే పెళ్లి అయిపోయిన విషయం బయటపడింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జిమ్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More : ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ విడుదల

One thought on “జిమ్ ట్రైనర్ ప్రేమ పేరుతో యువతిని మోసం”
Comments are closed.