సౌత్ ఇండస్ట్రీతో పోల్చితే బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా రూపొందుతుంటాయి. స్టార్ హీరోలు ఒకరితో ఒకరు కలిసి నటించటం అక్కడ సాధారణమే. తాజాగా బాలీవుడ్‌లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘లవ్ అండ్ వార్’లో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై బాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలోనూ భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఈ ముగ్గురు స్టార్స్ తమ-తమ కెరీర్‌లో సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు. రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాతో రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, విక్కీ కౌశల్ ‘ఛావా’ సినిమాతో రూ.500 కోట్ల మార్కును దాటాడు. ఇక ఆలియా భట్ ‘గంగూబాయి కథియావాడి’ వంటి సోలో సినిమాతో రూ.200 కోట్లను సంపాదించింది. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న ఈ ముగ్గురు కలిసి నటిస్తుండటంతో, ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. దీంతో పాటు రణబీర్, ఆలియా వివాహం అనంతరం తొలిసారి కలిసి నటిస్తుండటంతో వారి జోడీపై ఆసక్తి మరింత పెరిగింది.
భన్సాలీ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుండటంతో, కథ, కథనాల విషయంలోనూ నమ్మకాన్ని కలిగిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల కానున్న ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వచ్చితే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

One thought on “పాన్ ఇండియా క్రేజ్‌తో లవ్ అండ్ వార్ – భన్సాలీ భారీ ప్రాజెక్ట్”
Comments are closed.